Telangana: కాగజ్ నగర్ ఘటనలో మరో ట్విస్ట్.. ఎఫ్ఆర్వో అనిత, ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల కేసు!

  • ఫారెస్ట్ సిబ్బందిపై కోనేరు కృష్ణ అనుచరుల దాడి
  • తాజాగా పోలీసులకు సార్సాల గ్రామానికి చెందిన మహిళ ఫిర్యాదు
  • కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆవేదన

తెలంగాణలోని కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనితతో పాటు అధికారులపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడైన కోనేరు కృష్ణ అనుచరులు గతంలో దాడిచేసిన సంగతి తెలిసిందే. కాగజ్ నగర్ లో పోడు భూములను దున్నేందుకు వెళ్లిన సందర్భంగా ఎమ్మెల్యే సోదరుడి అనుచరులు వీరిని అడ్డుకున్నారు. కర్రలతో కొట్టారు.ఈ నేపథ్యంలో కోనేరు కృష్ణ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎఫ్ఆర్వో అనిత ఆరోపించారు.

తాజాగా ఎఫ్ఆర్వో అనిత, మరో 15 మంది అధికారులపై ఎస్టీ,ఎస్టీ వేధింపుల కేసు నమోదయింది. ఎఫ్ఆర్వో అనిత, ఫారెస్ట్ సిబ్బంది తనను కులం పేరుతో దూషించడంతో పాటు దాడికి పాల్పడ్డారని సార్సాల గ్రామానికి చెందిన నాయిని సరోజ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బందిపై ఎస్సీ,ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశామనీ, ప్రస్తుతం దర్యాప్తు  చేస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.

More Telugu News