జరుగుతున్నవాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు: యెడ్యూరప్ప

Sun, Jul 07, 2019, 11:39 AM
  • జరుగుతున్న పరిణామాలన్నీ మీకు తెలుసు
  • ఏం జరుగుతుందో వేచి చూద్దాం
  • కుమారస్వామి, సిద్ధరామయ్య వ్యాఖ్యలపై మాట్లాడను
కాంగ్రెస్-జేడీఎస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. బీజేపీనే ఇదంతా చేయిస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను తుమకూరుకు వెళ్తున్నానని, సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తానని అన్నారు. 'మారుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీకు తెలుసు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం. కుమారస్వామి, సిద్ధరామయ్యల వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడదలుచుకోలేదు. జరుగుతున్న దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు' అని చెప్పారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad