Karnataka: కర్ణాటక సంక్షోభం: గోవాకు ఎగిరిపోతున్న కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు

  • కర్ణాటకలో ముదురుతున్న రాజకీయ సంక్షోభం
  • ప్రత్యేక విమానంలో గోవాకు ఎమ్మెలు
  • స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించిన 13 మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్, జేడీఎస్ అసంతృప్త ఎమ్మెల్యేలు గోవాకు తరలుతున్నారు. ఎమ్మెల్యేలను గోవాకు తరలిస్తున్నారని, ప్రత్యేక విమానంలో వారంతా గోవా వెళ్తున్నట్టు శనివారం రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్ విలేకరులకు తెలిపారు. శనివారం ఆయన ప్రత్యేక విమానంలో గోవా వెళ్లేందుకు హిందూస్థాన్ ఏరో నాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో అధిష్టానం అప్రమత్తమైంది. పరిస్థితిని సమీక్షించి చక్కదిద్దేందుకు ఆ పార్టీ కర్ణాటక ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్‌ను బెంగళూరుకు పంపింది.

అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు జేడీఎస్ ఎమ్మెల్యే విశ్వనాథ్ ప్రకటించి కలకలం రేపారు.  గవర్నర్ వజుభాయ్ వాలాతో సమావేశం అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 13 మంది ఎమ్మెల్యేలు తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు అందించి ఆమోదించాల్సిందిగా కోరినట్టు తెలిపారు.  

More Telugu News