Rohit Sharma: ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ శర్మ అద్భుతమైన రికార్డు

  • ఒకే టోర్నీలో ఐదు సెంచరీలు
  • శ్రీలంకపై సూపర్ ఇన్నింగ్స్
  • లక్ష్యఛేదనలో దూసుకెళుతున్న టీమిండియా

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచకప్ లో అద్భుతమైన రికార్డు సాధించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు నమోదు చేశాడు. తద్వారా ఓ వరల్డ్ కప్ లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మన్ గా రికార్డు పుటల్లోకెక్కాడు. వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటివరకు ఇన్ని శతకాలు కొట్టిన మొనగాడు మరెవరూలేరు. ఇప్పటివరకు ఈ రికార్డు కుమార సంగక్కర పేరిట ఉంది. సంగా 4 సెంచరీలతో 2015 వరల్డ్ కప్ లో రికార్డు స్థాపించగా, రోహిత్ ఓ సెంచరీ ఎక్కువే కొట్టి సరికొత్త చరిత్ర లిఖించాడు. శ్రీలంకపై లీడ్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో శతకం చేయడం ద్వారా రోహిత్ ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.

అంతేకాదు, ఈ సెంచరీతో రోహిత్ హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. టోర్నీలో రోహిత్ కి ఇది వరుసగా మూడో శతకం కావడం విశేషం. కాగా, సెంచరీ పూర్తయిన కాసేపటికే రోహిత్ అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 194 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 19 ఓవర్లలో 71 పరుగులు చేయాలి.

2019 వరల్డ్ కప్ లో రోహిత్ సెంచరీల జాబితా

  • సౌతాంప్టన్ లో దక్షిణాఫ్రికాపై 122*
  • మాంచెస్టర్ లో పాకిస్థాన్ పై 140
  • బర్మింగ్ హామ్ లో ఇంగ్లాండ్ పై 102
  • బర్మింగ్ హామ్ లో బంగ్లాదేశ్ పై 104
  • లీడ్స్ లో శ్రీలంకపై 103

More Telugu News