ICC: టీమిండియా, శ్రీలంక మ్యాచ్ సందర్భంగా ఆకాశంలో వివాదాస్పద సందేశాన్ని ప్రదర్శించిన విమానం!

  • బ్యానర్ పై కశ్మీర్ నినాదం
  • సీరియస్ గా తీసుకున్న ఐసీసీ
  • స్థానిక పోలీసులకు సమాచారం

వరల్డ్ కప్ లో నిర్వహణ లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఇవాళ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య లీడ్స్ లో మ్యాచ్ జరుగుతుండగా మైదానం మీదుగా ఓ చిన్న విమానం వెళ్లింది. అయితే, ఆ విమానం ప్రదర్శించిన ఓ బ్యానర్ వివాదాస్పదమైంది. "కశ్మీర్లో భారత్ మారణహోమం ఆపాలి, కశ్మీర్ కు విమోచన కల్పించాలి" అనే నినాదం రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ ఆ విమానం వెళ్లడం పట్ల ఐసీసీ స్పందించింది.

ఇలాంటి చర్యలను అంగీకరించబోమని, ఇప్పటికే స్థానిక పోలీసులకు సమాచారం అందించామని ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఈ టోర్నీలో ఇలాంటి ఘటన కొన్నిరోజుల క్రితం కూడా జరిగింది. పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్ జట్లు మ్యాచ్ ఆడుతుండగా, ఓ విమానం జస్టిస్ ఫర్ బెలూచిస్థాన్ అని రాసి ఉన్న బ్యానర్ ను ప్రదర్శిస్తూ మైదానం చుట్టూ చక్కర్లు కొట్టింది. అదే సమయంలో మైదానంలో ఉన్న పాక్, ఆఫ్ఘన్ అభిమానులు కూడా బాహాబాహీకి దిగారు.

More Telugu News