Sri Lanka: మాథ్యూస్ వీరోచిత సెంచరీతో కోలుకున్న లంక

  • శ్రీలంక 47 ఓవర్లలో 5 వికెట్లకు 244 రన్స్
  • కెరీర్ లో మూడో వన్డే సాధించిన మాథ్యూస్
  • సాధించిన శతకాలన్నీ ఇండియాపైనే!

లీడ్స్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ సెంచరీ చేయడంతో శ్రీలంక జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. 55 పరుగులకే కీలకమైన 4 టాపార్డర్ వికెట్లు కోల్పోయిన లంక కోలుకుందంటే అది మాథ్యూస్ చలవే. మాథ్యూస్ మరో బ్యాట్స్ మన్ తిరిమన్నేతో కలిసి ఐదో వికెట్ కు 124 పరుగులు జోడించడంతో లంకకు స్వల్ప స్కోరు ప్రమాదం తప్పింది. తిరిమన్నే 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైనా మాథ్యూస్ మాత్రం తన పోరాటం కొనసాగించాడు. డిసిల్వాతో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో కెరీర్ లో తన మూడో సెంచరీ సాధించాడు. విశేషం ఏంటంటే, ఆ మూడు శతకాలు కూడా భారత్ పైనే నమోదు చేశాడు. ప్రస్తుతం శ్రీలంక 47 ఓవర్లలో 5 వికెట్లకు 244 పరుగులు చేసింది. మాథ్యూస్ 107, డిసిల్లా 22 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News