Bruce Lee: బాటిల్ క్యాప్ చాలెంజ్ ను బ్రూస్ లీ ఎప్పుడో చేశాడు... ఇదిగో వీడియో!

  • ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోన్న బాటిల్ క్యాప్ చాలెంజ్
  • వీడియో షేర్ చేసిన బ్రూస్ లీ కుమార్తె
  • నాన్ చాక్ తో మూడు బాటిళ్ల మూతలు తెరిచిన బ్రూస్ లీ

ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్న అంశం బాటిల్ క్యాప్ చాలెంజ్. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ స్వయంగా లెగ్ కిక్ తో ఓ బాటిల్ మూతను తెరవడంతో ఈ బాటిల్ క్యాప్ చాలెంజ్ విపరీతమైన ప్రాచుర్యం అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోన్న ఈ చాలెంజ్ ను మార్షల్ ఆర్ట్స్ పితామహుడు బ్రూస్ లీ ఎప్పుడో పూర్తిచేశాడని ఆయన కుమార్తె షానన్ లీ చెబుతున్నారు. అందుకు నిదర్శనంగా, ఓ వీడియోను బ్రూస్ లీ పేరిట ఉన్న అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇప్పటి చాలెంజ్ కు భిన్నంగా బ్రూస్ లీ నాన్ చాక్ తో మూడు బాటిళ్ల మూతలు అలవోకగా తెరవడం ఆ వీడియోలో చూడొచ్చు.

More Telugu News