Karnataka: ఎమ్మెల్యేల రాజీనామా.. సంక్షోభం దిశగా కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం!

  • రాజీనామాలకు సిద్ధపడ్డ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు
  • స్పీకర్ కార్యదర్శికి రాజీనామా పత్రాల సమర్పణ
  • సాధారణ మెజార్టీకి 113 మంది సభ్యులు అవసరం

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభం దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు జేడీఎస్ సభ్యులు రాజీనామాలకు సిద్ధపడ్డారు. కర్ణాటక విధాన సభ స్పీకర్ కార్యదర్శికి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యేలలో రామలింగారెడ్డి, సౌమ్యారెడ్డి, సోమశేఖర్, రమేశ్ జర్క హళ్లి, బీసీ పాటిల్, మునిరత్న, ప్రసాదగౌడ పాటిల్, శివరామ్ ఉన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీలో మొత్తం స్థానాలు 224. బీజేపీకి 105 మంది, కాంగ్రెస్ పార్టీకి 78 మంది, జేడీఎస్ కు 37 మంది సభ్యులు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. సాధారణ మెజార్టీకి 113 మంది సభ్యుల మద్దతు అవసరం.

నన్ను నిర్లక్ష్యం చేసినందుకే రాజీనామా నిర్ణయం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ, కొన్ని అంశాల్లో తనను నిర్లక్ష్యం చేశారని, అలా అని చెప్పి, పార్టీలో ఎవరినీ తాను నిందించట్లేదని చెప్పారు. తనను నిర్లక్ష్యం చేసినందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని అన్నారు. 

More Telugu News