Telugudesam: కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది: ఎంపీ కేశినేని నాని

  • రాష్ట్రానికి ఎప్పటిలాగే అన్యాయం జరిగింది
  • ‘పోలవరం’, అమరావతి అంశాల ప్రస్తావనే లేదు
  • విభజన చట్టంలోని అంశాల గురించీ మాట్లాడలేదు

పార్లమెంట్ లో ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచేయి చూపారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులపై స్పష్టత కరవు అయిందని అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు గడుస్తున్నా ఎన్నో హామీలు అమలు కాలేదని, బీజేపీ ప్రభుత్వం ఏపీ గురించి పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.

ఏపీ టీడీపీ ఎంపీ కేశినేని స్పందిస్తూ, కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని అన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి ఎప్పటిలాగే అన్యాయం జరిగిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి గురించి ప్రస్తావించలేదని అన్నారు. విభజన చట్టం అంశాలను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్ లో ఏపీలోని కేంద్రీయ, గిరిజన వర్శీటీలకు అరకొర నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని మిగతా విద్యాసంస్థల ఊసే ఎత్తలేదు.

More Telugu News