Nirmala Seetharaman: బడ్జెట్ పత్రాలను సూట్ కేసులో కాకుండా ఎర్రటి సంచిలో ఎందుకు తెచ్చానంటే..!: నిర్మలా సీతారామన్ వివరణ

  • బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయం
  • మోసుకురావడానికి కూడా సులభంగా ఉంటుంది
  • మన సంప్రదాయాల వైపు కదులుదాం

దేశ చరిత్రలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. ఇదే సమయంలో అనాదిగా వస్తున్న బ్రిటీష్ సాంప్రదాయానికి ఆమె ముగింపు పలికి సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. ఆంగ్లేయుల పాలన కాలం నుంచి గత ఏడాది కేంద్ర బడ్జెట్ వరకు బడ్జెట్ పత్రాలను లెదర్ బ్రీఫ్ కేసులో తీసుకురావడం జరిగింది. ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ఈరోజు ఎర్రటి సంచిలో బడ్జెట్ పత్రాలను పార్లమెంటుకు నిర్మలా సీతారామన్ తీసుకొచ్చారు. ఆ సంచిపై భారత అధికార చిహ్నమైన మూడు సింహాలు ఉన్నాయి. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు.

బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయమని నిర్మల తెలిపారు. అంతేకాదు మోసుకురావడానికి కూడా సులభంగా ఉంటుందని చమత్కరించారు. బడ్జెట్ పత్రాలను తీసుకురావడానికి లెదర్ సూట్ కేసునే నేను ఎందుకు వాడాలని ఆమె ప్రశ్నించారు. మన సంప్రదాయాల వైపు కదులుదామని చెప్పారు.

More Telugu News