sensex: కేంద్ర బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన స్టాక్ మార్కెట్

  • ఇన్వెస్టర్లను నిరాశకు గురి చేసిన బడ్జెట్
  • 395 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 136 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. బడ్జెట్ ప్రసంగం మొదలైనప్పటి నుంచి సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 395 పాయింట్లు నష్టపోయి 39,513కు పడిపోయింది. నిఫ్టీ 136 పాయింట్లు పతనమై 11,811కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.16%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.17%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.90%), ఐటీసీ (0.63%), భారతీ ఎయిర్ టెల్ (0.62%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-8.36%), ఎన్టీపీసీ (-4.81%), మహీంద్రా అండ్ మహీంద్రా (-4.41%), వేదాంత లిమిటెడ్ (-4.41%), సన్ ఫార్మా (-4.34%).

More Telugu News