India: విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ‘స్టడీ ఇన్ ఇండియా’.. బడ్జెట్ లో ప్రకటించిన కేంద్ర మంత్రి సీతారామన్!

  • 2019-20 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల
  • నేషనల్ ట్రాన్స్ పోర్టు కార్డు తీసుకొస్తున్నామని ప్రకటన
  • స్టార్ట్ అప్ కోసం ప్రత్యేక టీవీ ఛానల్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2019-20 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాబోయే ఏడాదికాలంలో ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యాలను చట్టసభ్యులతో పాటు దేశ ప్రజలకు వివరించారు. దేశంలో కోటి మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటివరకూ దేశంలో 657 కిలోమీటర్ల మెట్రో రైల్వే లైనును నిర్మించామనీ, మరో 300 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణం కోసం అనుమతి ఇచ్చామని వెల్లడించారు. భారత్ ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు.

  • దేశవ్యాప్తంగా రవాణ కోసం పనికొచ్చేలా ‘నేషనల్ ట్రాన్స్ పోర్టు కార్డు’ తెస్తున్నాం
  • విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు ‘స్టడీ ఇన్ ఇండియా’ పథకం
  • 2019-20 నాటికి విద్యాసంస్థల ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రూ.400 కోట్లు విడుదల
  • స్టార్ట్ అప్ కోసం ప్రత్యేక టీవీ ఛానల్ ఏర్పాటు
  • ముద్ర పథకం కింద స్వయం సహాయక బృందాలకు రూ.లక్ష వరకూ రుణం
  • ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన(పీఎంజీఎస్ వై) మూడో దశ ప్రారంభం
  • ఈ పథకం కింద రాబోయే ఐదేళ్లలో రూ.80,250 కోట్లతో 1,25,000 కిలోమీటర్ల రోడ్ల అప్ గ్రేడ్
  • స్ఫూర్తి పథకం కింద గ్రామాల్లో సంప్రదాయ పరిశ్రమలు, కళలకు పునరుజ్జీవం, గ్రామీణులకు ఉపాధి
  • దీని కింద ఖాదీ, వెదురు, తేనె సాగుకు ప్రోత్సాహం.. 100 క్లస్టర్లకు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయం
  • 2019-20 మధ్యకాలంలో ప్రజలకు స్థానికంగానే ఉపాధి కోసం 80 బిజినెస్, 20 టెక్నాలజీ ఇంక్యుబేటర్ల ఏర్పాటు
  • ఆస్పైర్ పథకం కింద ఏర్పాటు చేసిన ఈ ఇంక్యుబేటర్లతో 75,000 మంది ఎంట్రప్రెన్యూర్లకు శిక్షణ
  • ఇప్పటివరకూ 5.6 లక్షల గ్రామాలు బహిరంగ మలమూత్ర విసర్జన లేని ఊర్లుగా మారాయి
  • కార్మికుల సంరక్షణ కోసం నాలుగు లేబర్ కోడ్ లు, కార్మిక చట్టాల పరిరక్షణ
  • ఆటల్లో నైపుణ్యం పెంపొందించేందుకు జాతీయ స్పోర్ట్స్ కమిషన్ ఏర్పాటు
  • దేశవ్యాప్తంగా 10 లక్షల మంది యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రాయితీ కోసం రూ.350 కోట్ల నిధులు
  • ఆర్థిక వెసులుబాటు కోసం ప్రత్యేక పథకం
  • స్టాక్ మార్కెట్ లో ఎన్నారై పెట్టుబడిదారులకు మరింత వెసులుబాటు..  వీరి పెట్టుబడులకు ఫారిన్ పోర్టుపోలియోలుగా గుర్తింపు.

More Telugu News