Hafiz saeed: అబ్బో.. ఇలాంటివి చాలా చూశాం.. హఫీజ్ విషయంలో పాక్ తీరుపై భారత్ స్పందన

  • హఫీజ్ సయీద్‌పై 20కిపైగా కేసులు
  • గతంలోనూ కేసులు పెట్టి అటకెక్కించారన్న రవీశ్ కుమార్
  • అంతర్జాతీయ సమాజాన్ని పాక్ మోసం చేస్తోందని మండిపాటు

సేవా సంస్థల ముసుగులో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తున్న ఆరోపణలపై జమాత్ ఉద్ దవా (జేయూడీ) చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌పైనా, ఆయన అనుచరులపైనా పాక్ 20కిపైగా కేసులు నమోదు చేసింది. పాక్ చర్యలపై భారత్ స్పందించింది. ఇలాంటివి గతంలోనూ చాలా చూశామని, ఇటువంటి చర్యల వల్ల తాము ఫూల్స్ కాబోమని పేర్కొంది. ఉగ్రవాదంపై పాక్ తీసుకుంటున్నవి కంటి తుడుపు చర్యలేనని, ఇవి సరిపోవని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్ తేల్చి చెప్పారు.

పాక్ గతంలోనూ ఇలాంటివి చాలానే చేసిందని అయితే, కేసుల తర్వాత ఏమైందన్నది అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ కేసులన్నీ అటకెక్కాక కానీ ఉగ్రవాదులపై పాక్ వైఖరి ఏంటన్నది తెలిసి రాలేదని పేర్కొన్నారు. ఇలాంటి చిన్నచిన్న కేసులతో ప్రపంచాన్ని మోసం చేయాలని పాక్ ప్రయత్నిస్తోందని రవీశ్ కుమార్ ఆరోపించారు.  

More Telugu News