Afghanistan: ధాటిగా ఆడుతూ లక్ష్యం దిశగా పయనిస్తున్న ఆఫ్ఘన్లు!

  • రాణించిన ఓపెనర్ రహ్మత్ షా
  • క్రీజులో పాతుకుపోయిన కుర్ర వికెట్ కీపర్ అలీఖిల్
  • విండీస్ 311/6

ఒక్క అనుభవలేమి తప్ప ఆఫ్ఘనిస్థాన్ జట్టును మరి దేంట్లోనూ తక్కువ అంచనా వేయలేం! ప్రతిభావంతులతో తులతూగే ఈ ఆసియా జట్టు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో తన ఉనికిని చాటుకుంటోంది. అయితే, ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదుచేయలేకపోయింది. తాజాగా, వెస్టిండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో మాత్రం భారీ లక్ష్యం కళ్లముందున్నా, తొణుకుబెణుకు లేకుండా ధాటిగా ఆడే ప్రయత్నం చేస్తోంది. 32 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 2 వికెట్లకు 167 పరుగులు. విజయానికి చేయాల్సింది 18 ఓవర్లలో 145 పరుగులు. చేతిలో 8 వికెట్లున్న నేపథ్యంలో, మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది. ప్రస్తుతం క్రీజులో 18 ఏళ్ల కుర్ర వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్ 77 పరుగులతోనూ, నజీబుల్లా జాద్రాన్ 18 పరుగులతోనూ ఆడుతున్నారు. అంతకుముందు ఓపెనర్ రహ్మత్ షా 62 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది.

More Telugu News