Indonesia: ఇండోనేషియాలో వింతజీవి ప్రత్యక్షం... సీలింగ్ ను అంటిపెట్టుకుని షికార్లు!

  • ఓ వ్యక్తి నివాసంలో కనిపించిన ఏలియన్ తరహా కీటకం
  • సగం కీటకంలా, సగం జంతువులా దర్శనం
  • ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియాల్లో ఉంటుందన్న జంతుశాస్త్ర నిపుణులు

ఈ భూమండలం అనేక వింతలు, విడ్డూరాలకు నెలవు! తాజాగా, ఇండోనేషియాలో ఓ ఇంట్లో కనిపించిన ఏలియన్ తరహా వింతజీవి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. బాలీలోని హారీ టోయే అనే వ్యక్తి నివాసంలోని సీలింగ్ కు అతుక్కుని ఉన్న స్థితిలో ఈ ప్రాణి కనిపించింది. దానికి రెండు రెక్కలు, ఏనుగు తొండాల్లాంటి నాలుగు ప్రత్యేక టెంటకిల్స్ ఉన్నాయి. సగం కీటకంలా, సగం జంతువులా కనిపిస్తున్న ఈ జీవిని ఏమని పిలుస్తారో కూడా తనకు తెలియదని, ఇలాంటి విచిత్రజీవిని చూడడం ఇదే ప్రథమమని హారీ టోయే తెలిపాడు. అయితే, జంతుశాస్త్ర నిపుణులు మాత్రం ఇది ఆర్కిటినే కుటుంబానికి చెందిన కీటకం అని చెబుతున్నారు. క్రీటోనోటస్ గాంగిస్ అనే కీటకానికి దగ్గరి బంధువని, ఆగ్నేయ ఆసియా, ఆస్ట్రేలియాల్లో మాత్రమే కనిపిస్తాయని అంటున్నారు.

More Telugu News