alek singley: ఆస్ట్రేలియా విద్యార్థిని విడుదల చేసిన ఉత్తరకొరియా

  • కిమ్ ఇల్ సంగ్ యూనివర్శిటీలో చదువుతున్న ఆసీస్ విద్యార్థి
  • అదృశ్యమైనట్టు గత నెలలో ప్రకటించిన కుటుంబసభ్యులు
  • విద్యార్థి విడుదల కోసం కృషి చేసిన స్వీడన్

ఉత్తరకొరియా కస్టడీలో ఉన్న తమ దేశ విద్యార్థి అలెక్ సిగ్లీని ఆ దేశం విడుదల చేసిందని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. అలెక్ ఆరోగ్యంగా, సురక్షితంగా ఉన్నాడని చెప్పారు. ఉత్తరకొరియాతో ఆస్ట్రేలియాకు దౌత్య సంబంధాలు లేవని... అందువల్ల సిగ్లీ విడుదల కోసం స్వీడన్ తమకు సహకారం అందించిందని తెలిపారు. సిగ్లీ విడుదల కోసం కృషి చేసిన స్వీడిష్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.

కిమ్ ఇల్ సంగ్ యూనివర్శిటీలో 29 ఏళ్ల సిగ్లీ విద్యను అభ్యసిస్తున్నాడు. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ లో నివాసం ఉంటున్నాడు. అతను అదృశ్యమైనట్టు అతని కుటుంబసభ్యులు గత నెలలో వెల్లడించారు. సింగ్లీ బీజింగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడని... సాయంత్రం టోక్యోకు పయనమవుతాడని ఎన్కే న్యూస్ తెలిపింది.

More Telugu News