Samanta: 'బాహుబలి సమంత'... కటౌట్ పై ముద్దుగుమ్మ ఫన్నీ కామెంట్!

  • థియేటర్ల వద్ద సమంత భారీ కటౌట్ లు
  • జిమ్ ప్రచారం నిమిత్తం వాడుకుంటామన్న నెటిజన్
  • 'బేబీ ఆన్‌ స్టెరాయిడ్స్‌' అన్న సమంత

అక్కినేని వారింటి కోడలు సమంత ప్రధాన పాత్రలో ఎమోషనల్‌ కామెడీగా తెరకెక్కిన 'ఓ బేబీ' రేపు విడుదల కానుండగా, హైదరాబాద్‌ లోని ఓ థియేటర్‌ దగ్గర ఏర్పాటు చేసిన బాహుబలి సైజ్ సమంత కండల కటౌట్, ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుండగా ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. తన స్నేహితుడు ఈ కటౌట్ ను తన జిమ్ కు వ్యాపార ప్రకటన నిమిత్తం వాడుకోవాలని భావిస్తున్నాడని, మీ కటౌట్ ను కొద్దిగా మార్చి కండలు కనిపించేలా చేశాడని చెప్పిన ఓ నెటిజన్ వ్యాఖ్యపై సమంత కూడా స్పందించింది. "బేబీ ఆన్‌ స్టెరాయిడ్స్‌" అని సమాధానం ఇచ్చింది. కాగా, రేపు విడుదలవనున్న సినిమాలో నాగశౌర్య, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్‌, రావూ రమేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

More Telugu News