Ponnam Prabhakar: రాష్ట్రంలో మునిసిపాలిటీల డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగింది: తెలంగాణ కాంగ్రెస్

  • రాజకీయ దురుద్దేశంతోనే వార్డుల విభజన
  • ఐదేళ్లుగా వచ్చిన విజ్ఞప్తులను విస్మరించారు
  • ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటానికి సిద్ధం

రాష్ట్రంలో మునిసిపాలిటీల డీలిమిటేషన్‌తో పాటు వార్డుల విభజన అశాస్త్రీయంగా జరిగిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. త్వరలో మునిసిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నేడు కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో మునిసిపల్ ఎన్నికలు, వార్డుల విభజన అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్, వంశీచంద్ రెడ్డి సమావేశానంతరం మీడియాతో మాట్లాడారు.

మునిసిపాలిటీల వార్డుల విభజన రాజకీయ దురుద్దేశంతోనే చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా వచ్చిన విజ్ఞప్తులను విస్మరించి పునర్విభజన చేశారన్నారు. మునిసిపాలిటీ వార్డుల వినతుల కోసం గడువును పెంచాలని డిమాండ్ చేశారు. వార్డుల విభజనలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటానికి సైతం సిద్ధమన్నారు.  

More Telugu News