Kolkatha: వృద్ధుడిని ఢీకొట్టి పారిపోయే యత్నం.. అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన ద్విచక్ర వాహనదారుడు!

  • ఓరంగ్ కాళ్లు, చేతులకు గాయాలు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓరంగ్
  • పరామర్శించిన పోలీస్ కమిషనర్ అనేజ్ శర్మ

ఓ వృద్ధుడిని తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టి పారిపోతుండగా, అడ్డుకున్న కానిస్టేబుల్‌ను కూడా 100 మీటర్ల మేర ఓ వ్యక్తి ఈడ్చుకెళ్లిన ఘటన కోల్‌కతాలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం, కోల్‌కతాలోని బెక్‌బగాన్ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు ఓ వృద్ధుడిని ఢీకొట్టడంతో అతను కిందపడిపోయాడు. వెంటనే దీనిని గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ తపాన్ ఓరంగ్, ద్విచక్ర వాహనదారుడిని పట్టుకునేందుకు యత్నించాడు.

చటుక్కున ఓరంగ్ చేతిని అందుకున్న ద్విచక్ర వాహనదారుడు 100 మీటర్ల మేర రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో ఓరంగ్ కాళ్లు, చేతులకు గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనను కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనేజ్ శర్మ పరామర్శించారు. ఓరంగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా ద్విచక్ర వాహనదారుడిని గుర్తించేందుకు యత్నిస్తున్నారు.  

More Telugu News