Adimulapu Suresh: ఏపీ ఎంసెట్ ఎంపీసీ ప్రవేశాల కౌన్సిలింగ్ లో మార్పు: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • కౌన్సెలింగ్ 8వ తేదీ నుంచి షురూ
  • ర్యాంకుల ఆప్షన్లు మార్చుకునే తేదీ 14కి మార్పు
  • ధ్రువపత్రాల పరిశీలన గడువు ఈ నెల 7వరకు పొడిగింపు

ఎంసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తాజా సమాచారాన్ని వెల్లడించారు. ఎంసెట్ ఎంపీసీ ప్రవేశాల్లో మార్పు చోటుచేసుకున్నట్టు తెలిపారు. 1 నుంచి 30 వేల ర్యాంకులకు 3,4 తేదీల్లో జరగాల్సిన కౌన్సెలింగ్ ను 8,9 తేదీలకు మార్చినట్టు వెల్లడించారు. 30,001 నుంచి 75 వేల ర్యాంకు వరకు 5,6 తేదీల్లో జరగాల్సిన కౌన్సెలింగ్ ను 10, 11 తేదీలకు మార్చినట్టు మంత్రి వివరించారు.

ఇక 75,001 నుంచి చివరి ర్యాంకు వరకు 7,8 తేదీల్లో జరగాల్సిన కౌన్సెలింగ్ 12, 13 తేదీలకు మార్చినట్టు చెప్పారు. ర్యాంకుల ఆప్షన్లు మార్చుకునే తేదీని 9 నుంచి 14వ తేదీకి మార్పు చేసినట్టు మంత్రి ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఈ నెల 11న వెబ్ సైట్ లో సాయంత్రం ఆరింటికి జరిగే కేటాయింపు 16వ తేదీకి మార్చినట్టు వెల్లడించారు. ధ్రువపత్రాల పరిశీలన గడువును ఈ నెల 7వరకు పొడిగించామని ఆయన తెలిపారు.

More Telugu News