Vijay Mallya: యూకే హైకోర్టులో విజయ్ మాల్యాకు స్వల్ప ఊరట

  • భారత్ కు అప్పగించాలన్న కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు తీర్పు
  • మాల్యా అప్పీల్ చేసుకోవచ్చంటూ తీర్పు
  • కోర్టు వ్యవహారాలంటే క్రికెట్ మ్యాచ్ కాదన్న మాల్యా

ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు కాస్త ఊరట లభించేలా కోర్టు తీర్పునిచ్చింది. అనేక భారత బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా బ్రిటన్ పారిపోవడం తెలిసిందే. అయితే, మాల్యాను భారత్ కు అప్పగించాలంటూ గతంలో లండన్ వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం తీర్పు ఇవ్వగా, దానిపై అప్పీల్ చేసుకోవచ్చంటూ తాజాగా యూకే హైకోర్టు మాల్యాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తద్వారా, తనను భారత్ కు అప్పగించాలన్న కోర్టు ఉత్తర్వులను మాల్యా సవాల్ చేయగలిగే వీలుచిక్కింది.

ఇక, విచారణ జరుగుతున్న కోర్టు వద్దకు తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, గాళ్ ఫ్రెండ్ పింకీ లాల్వానీతో కలిసి వచ్చిన విజయ్ మాల్యా భవిష్యత్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, కోర్టు వ్యవహారం అంటే క్రికెట్ మ్యాచ్ కాదని, ఎప్పుడు ఎలా పరిస్థితులు మారిపోతాయో అంచనా వేయలేమని అన్నారు. అయితే తన వద్ద కాకలుతీరిన లాయర్లు ఉన్నారని, వారు తన ప్రయోజనాలు కాపాడతారన్న నమ్మకం ఉందని తెలిపారు.

More Telugu News