Mumbai: ముంబై-హైదరాబాద్ విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!

  • ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు
  • నగరంలో స్తంభించిన జనజీవనం 
  • అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా రద్దు 

ముంబైలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా జనజీవనం స్తంభించి పోయింది. ఈ నేపథ్యంలో ముంబైకు పలు ప్రాంతాల నుంచి వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేసినట్టు సమాచారం. అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లే అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలంగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ముంబై మీదుగా వెళ్లాల్సిన అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్టు వివరించారు.

More Telugu News