Kagajnagar: ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా దాడి ఘటనపై విచారణ నిర్వహించండి: మంత్రిని కోరిన అటవీ ఉద్యోగుల జేఏసీ

  • కాగజ్‌నగర్ ఘటనపై చర్య తీసుకోవాలి
  • పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి
  • పోలీసులతో రక్షణ కల్పిస్తామన్న ఇంద్రకరణ్

కాగజ్‌నగర్ ఘటనపై చర్య తీసుకోవాలంటూ అటవీ ఉద్యోగుల జేఏసీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని కోరింది. నేడు ఆయనను కలిసిన జేఏసీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి అటవీ ఉద్యోగులపై జరిగిన దాడి ఘటనపై విచారణ నిర్వహించాలని కోరింది. నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని జేఏసీ విజ్ఞప్తి చేసింది. దీనిపై స్పందించిన ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీ అధికారులపై జరిగిన దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందన్నారు. ఇప్పటికే దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని, పోలీసులతో వారికి రక్షణ కల్పిస్తామని ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు.

More Telugu News