Telugudesam: గత ప్రభుత్వం డబ్బులన్నీ పసుపు- కుంకుమకు మళ్లించి.. విత్తన సరఫరా బకాయిలను చెల్లించలేదు: ఏపీ మంత్రి కన్నబాబు

  • గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది
  • వేరుశనగ విత్తనాల సరఫరాపై నిర్లక్ష్యమే కొరతకు కారణం
  • విత్తన కంపెనీలు 14 నెలల కాలంలో 50 లేఖలు రాశాయి

గత ప్రభుత్వం డబ్బులన్నీ పసుపు- కుంకుమకు మళ్లించి.. విత్తన సరఫరా బకాయిలను చెల్లించలేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. విత్తనాల కొరత అంశంపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుండటంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడమే సమస్యకు కారణమని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం వేరుశనగ విత్తనాల సరఫరాపై వహించిన నిర్లక్ష్యమే నేటి కొరతకు కారణమన్నారు. తమకు పాలన చేత కాదని, విత్తనాల పంపిణీలో విఫలమయ్యామని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని కన్నబాబు మండిపడ్డారు. తమకు బకాయిలు చెల్లించకపోవడంతో విత్తన కంపెనీలు 14 నెలల కాలంలో 50 లేఖలు రాశాయని విమర్శించారు. గత ప్రభుత్వం విత్తనాల కోసం రాయితీ నిధులు సైతం ఇవ్వలేదని కన్నబాబు విమర్శించారు.

More Telugu News