ram: రామ్ ఆశలన్నీ 'ఇస్మార్ట్ శంకర్'పైనే

  • పోస్టు ప్రొడక్షన్ పనుల్లో 'ఇస్మార్ట్ శంకర్'
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
  • ఈ నెల 18వ తేదీన విడుదల 

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' రూపొందింది. ఇటీవలే జరిగిన ఒక పాట చిత్రీకరణతో ఈ సినిమా షూటింగు పూర్తయింది. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన టీజర్ కు.. మణిశర్మ స్వరకల్పనలో వదిలిన నాలుగు పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే ఆశతో రామ్ వున్నాడు. ఆయన ఆశ ఈ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి. మాస్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా నిధి అగర్వాల్ - నభా నటేశ్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News