Mumbai: ముంబై ఎయిర్ పోర్టు ప్రధాన రన్ వే మూసివేత... 54 విమానాల దారి మళ్లింపు!

  • ముంబైలో భారీ వర్షాలు
  • పలు విమాన సర్వీసులు రద్దు
  • నేడు కూడా కొనసాగే అవకాశం

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ముంబైలో జనజీవనం అస్తవ్యస్తం కాగా, ఆ ప్రభావం విమానాల రాకపోకలపైనా పడింది. ముంబై విమానాశ్రయం పరిసరాల్లో కురుస్తున్న కుంభవృష్టితో ప్రధాన రన్ వేపై భారీ ఎత్తున నీరు చేరింది. ఓ విమానం రన్ వేపై నీటిలో చిక్కుకుపోయి కదలకుండా నిలిచిపోయింది. ఇదే సమయంలో రెండో రన్ వే సైతం వర్షపు నీటితో నిండటంతో 54 విమానాలను దారిమళ్లించాల్సి వచ్చింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, దుబాయ్, కోల్ కతా, హైదరాబాద్, గోవా తదితర ప్రాంతాల నుంచి రావాల్సిన విమానాలను దారి మళ్లించారు. విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్ తదితర ఎయిర్ లైన్స్ సంస్థలు ముంబైకి నడపాల్సిన కొన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. నేడు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో విమాన ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. 

More Telugu News