Depression: నేడు వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. కోస్తాలో మత్స్యకారులకు హెచ్చరికలు జారీ

  • సోమవారం తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం
  • సముద్ర తీర ప్రాంతాల్లో తీవ్ర గాలులు 
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు

ఈశాన్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం సోమవారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో గాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు జిల్లాలతోపాటు రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

More Telugu News