పాత బాంబు పేలడంతో చిన్నారి సహా ముగ్గురి మృతి

01-07-2019 Mon 21:13
  • ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వైపు వెళుతుండగా దొరికిన బాంబు
  • చిన్నారి సహా తండ్రీకూతుళ్లు అక్కడికక్కడే మృతి
  • గాయపడిన వ్యక్తి ఆసుపత్రికి తరలింపు
ఓ కుటుంబానికి ఆర్మీకి చెందిన పాత బాంబు ఒకటి దొరకడంతో, అందులోని కాంస్య లోహాన్ని తీయడానికి యత్నించారు. దీంతో అది పేలి ఏడాది వయసున్న చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని మసుదా గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్ జాదవ్(55), అతని కుమార్తె, ఏడాది వయసున్న ఆమె చిన్నారితో కలిసి నేటి ఉదయం ఆర్మీ ఫైరింగ్ రేంజ్ వైపు వెళుతుండగా ఆ పక్కనే పాత బాంబు ఒకటి దొరికింది. అందులోనుంచి కాంస్య లోహాన్ని బయటకు తీసేందుకు యత్నించారు. ఆ సమయంలో బాంబు కాస్తా పేలి చిన్నారి సహా తండ్రీకూతుళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా అక్కడే ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.