India: ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓటమికి రెండు కారణాలు చెప్పిన గంగూలీ

  • టీమిండియా బ్యాటింగ్ పై దాదా అసంతృప్తి
  • రన్ రేట్ మెయింటైన్ చేయలేదంటూ విమర్శ
  • పవర్ హిట్టింగ్ వేళ సింగిల్స్ ఏంటంటూ అసహనం

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తొలి ఓటమి ఎదుర్కోవడం పట్ల అభిమానుల బాధ వర్ణనాతీతం. ఇంగ్లాండ్ తో నిన్న బర్మింగ్ హామ్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఛేజింగ్ లో తీవ్రంగా నిరాశపరిచింది. దీనిపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తనదైన శైలిలో స్పందించాడు. భారత్ ఓటమికి రెండు ప్రధాన కారణాలను పేర్కొన్నాడు. తొలి 10 ఓవర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోడీ నిదానంగా ఆడడం మొదటి కారణమైతే, చివర్లో ధోనీ, జాదవ్ జోడీ కేవలం సింగిల్స్ తో సరిపెట్టుకోవడం రెండోదని వివరించాడు.

రోహిత్, కోహ్లీ ఆడుతున్నప్పుడు ఛేజింగ్ కు అవసరమైన రన్ రేట్ లోపించిందని, ఇద్దరిలోనూ దూకుడు కనిపించలేదని తెలిపాడు. ఇక, ఆఖర్లో పవర్ హిట్టింగ్ చేయాల్సిన స్థితిలో ధోనీ, జాదవ్ భారీ షాట్లు అవసరమైన దశలో బంతికో పరుగు చొప్పున సింగిల్స్ తీయడం దారుణమని అభిప్రాయపడ్డాడు. ధోనీ, జాదవ్ పార్ట్ నర్ షిప్ ను వర్ణించడం తన వల్ల కాదని అన్నాడు. వరల్డ్ కప్ లో అజేయంగా సాగుతున్న టీమిండియా ఓటమిపాలవడానికి ఇవే ముఖ్యకారణాలని గంగూలీ తెలిపాడు.

More Telugu News