Vijayawada: నేడు వైద్యం అత్యంత ఖరీదైపోయింది!: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

  • ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
  • మంచి ఆహారపు అలవాట్లతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
  • ప్రజలకు డాక్టర్లకు మధ్య సత్సంబంధాలు ఉండాలి

నేడు వైద్యం అత్యంత ఖరీదై పోయిందని, ఇలాంటి తరుణంలో పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా ‘ప్రజాశక్తి’ యాజమాన్యం ఆధ్వర్యంలో విజయవాడలోని కృష్ణలంకలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వెల్లంపల్లి శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ మధుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచి ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ప్రజలకు డాక్టర్లకు మధ్య మంచి సంబంధాలు కొనసాగాలని అభిప్రాయపడ్డారు.

More Telugu News