bank: లోన్లు తీసుకునే వ్యక్తులపై దాడి చేసే హక్కు బ్యాంకు రికవరీ ఏజెంట్లకు లేదు: లోక్ సభలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

  • రికవరీ ఏజెంట్లకు పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది
  • హింసాత్మక ధోరణితో లోన్లు రికవరీ చేయరాదు
  • లోన్ల రికవరీకి బ్యాంకులు బౌన్సర్లను నియమించుకోరాదు

బ్యాంకుల నుంచి ఏదైనా లోన్ తీసుకుని సరైన సమయంలో చెల్లించని వారికి రికవరీ ఏజెంట్లు చుక్కలు చూపిస్తుంటారు. పలు సందర్భాల్లో భౌతిక దాడులకు కూడా పాల్పడుతుంటారు. ఇదే అంశంపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈరోజు లోక్ సభలో క్లారిటీ ఇచ్చారు. కండపుష్టి కలిగినవారిని లోన్ల రికవరీకి నియమించుకోరాదని... నియమనిబంధలనకు అనుగుణంగానే రికవరీ ఏజెంట్లను నియమించుకోవాలని చెప్పారు.

ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానమిస్తూ... రికవరీ ఏజెంట్లుగా నియమించుకునేవారికి పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని ఠాకూర్ చెప్పారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రూపొందించిన ప్రక్రియను కూడా రికవరీ ఏజెంట్లు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. రికవరీ ఏజెంట్లు చట్ట విరుద్ధంగా, అనాగరికంగా, హింసాత్మక ధోరణులతో రికవరీ చేయకూడదనే విషయాన్ని అన్ని బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టంగా చెప్పిందని వెల్లడించారు. కండపుష్టి కలిగి లోన్లు తీసుకునే వ్యక్తులపై దాడి చేసేందుకు ఎవరికీ హక్కు లేదని స్పష్టం చేశారు.

More Telugu News