Telangana: కాగజ్ నగర్ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నాం: తెలంగాణ హోంమంత్రి

  • తెలంగాణలో మహిళా ఎఫ్ఆర్ఓపై పాశవిక దాడి
  • అటవీశాఖ అధికారులకు రక్షణ కల్పిస్తామన్న హోంమంత్రి
  • దాడికి కారకుడు కోనేరు కృష్ణపై కేసు నమోదు

తెలంగాణలో అటవీభూముల్లో అక్రమసాగును అడ్డుకునేందుకు వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ అధికారిణిపై ఎమ్మెల్యే కోనప్ప కుటుంబీకులు దాడిచేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. దీనిపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. కాగజ్ నగర్ ఘటనలో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. అటవీ అధికారులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అన్యాక్రాంతమైన అటవీభూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినా, హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లినా పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా, మహిళా ఎఫ్ఆర్ఓపై దాడి ఘటనలో కాగజ్ నగర్ డీఎస్పీ, రూరల్ సీఐలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ దాడికి కారకుడైన ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణతో పాటు 16 మందిపై కేసులు నమోదయ్యాయి.

More Telugu News