Andhra Pradesh: సీఎం జగన్ ఇంటివద్ద తొక్కిసలాట.. స్పృహ కోల్పోయిన మహిళ!

  • ఇప్పటికే రద్దయిన ప్రజాదర్బార్
  • తెలియక దూర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు
  • బాధితురాలు అనంతపురం వాసిగా గుర్తింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని, అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి ప్రజాదర్బార్ ను చేపడతామని మంత్రి కన్నబాబు ప్రకటించారు. అయితే ఈ విషయం తెలియని పలువురు ప్రజలు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్నారు. సీఎం జగన్ తమ అర్జీలు స్వయంగా తీసుకుంటారన్న ఆశతో ఎదురుచూశారు.

ఈ క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా కనేకల్లు మండలానికి చెందిన విశ్రాంతమ్మ అనే మహిళ ఊపిరిఆడక స్పృహ కోల్పోయింది. దీంతో ప్రజలు, సీఎం ఇంటి దగ్గర పోలీసులు ఆమెను అంబులెన్సులో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సీఎం జగన్ ను కలుసుకునేందుకు రెండు వాహనాల్లో వచ్చిన ప్రజలను పోలీసులు అనుమతించారనీ, ఈ సందర్భంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

More Telugu News