Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అఖిల్ నాయికగా రష్మిక 
  • విశాఖలో 'వెంకీ మామ' 
  • 'బంగారుబుల్లోడు'గా నరేశ్

*  అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి కథానాయికగా రష్మికను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. పలువురుని పరిశీలించిన పిదప రష్మికను ఎంచుకున్నారట. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.
*  వెంకటేశ్, నాగ చైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వెంకీ మామ' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ప్రధాన తారాగణం పాల్గొనే కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇదిలాఉంచితే, ఇంతకుముందు షెడ్యూలు 25 రోజుల పాటు కశ్మీర్లో జరిగింది.
*  గతంలో బాలకృష్ణ నటించిన 'బంగారుబుల్లోడు' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇదే టైటిల్ తో అల్లరి నరేశ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. పీవీ గిరి దర్శకత్వంలో అల్లరి నరేశ్ కథానాయకుడుగా అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రానికి 'బంగారుబుల్లోడు' టైటిల్ని నిర్ణయించారు. 

More Telugu News