Rohit Sharma: సెంచరీ పూర్తి చేసుకున్న 'హిట్ మ్యాన్'... ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్

  • 106 బంతుల్లో రోహిత్ 100
  • 15 ఫోర్లు బాదిన రోహిత్
  • టీమిండియా స్కోరు 36 ఓవర్లలో 198/2

ఇంగ్లాండ్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో హిట్ మ్యాన్ గా పేరుగాంచిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు రోహిత్ శర్మ వెన్నుదన్నుగా నిలిచాడు. రోహిత్ శర్మ 106 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్ లో రోహిత్ కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ ముంబైవాలా స్కోరులో 15 ఫోర్లున్నాయి. ఇక, కెప్టెన్ విరాట్ కోహ్లీ 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కాగా, క్రీజులోకి యువ ఆటగాడు రిషబ్ పంత్ వచ్చాడు. పంత్ ప్రస్తుతం 26 పరుగుల మీద ఆడుతుండగా, రోహిత్ 102 పరుగులు చేశాడు. లక్ష్యఛేదనలో టీమిండియా 36 ఓవర్లలో 2 వికెట్లకు 198 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 14 ఓవర్లలో 140 పరుగులు చేయాలి.

More Telugu News