Bay Of Bengal: ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం... కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు!

  • మరో 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
  • కొన్ని చోట్ల భారీ వర్షాలు
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరిక

ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ విభాగం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుండడంతో కోస్తా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గఢ్ లో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం వెల్లడించింది.

More Telugu News