India: స్పీడు పెంచిన టీమిండియా... 28 ఓవర్లకు 144/1

  • టీమిండియా టార్గెట్ 338 రన్స్
  • రోహిత్, కోహ్లీ అర్ధసెంచరీలు
  • క్రమంగా కరుగుతున్న లక్ష్యం!

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో భారీ లక్ష్యం కళ్ల ముందు ఉన్నా టీమిండియా మాత్రం నిలకడైన ఆటతీరుకు పెద్ద పీట వేసింది. మొదట్లోనే దూకుడు ప్రదర్శించి వికెట్లు చేజార్చుకోకుండా భాగస్వామ్యం నిర్మించడంపై దృష్టిపెట్టింది. రాహుల్ రూపంలో తొలి వికెట్ మొదట్లోనే పడినా, కెప్టెన్ కోహ్లీ, మరో ఓపెనర్ రోహిత్ శర్మ నిదానంగా మొదలుపెట్టి క్రమంగా స్పీడందుకున్నారు. ప్రస్తుతం టీమిండియా 28 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 144 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 77, కోహ్లీ 66 పరుగులతో ఆడుతున్నారు. భారత్ విజయానికి 22 ఓవర్లలో 194పరుగులు చేయాలి.

More Telugu News