Minister: జగన్ నెలరోజుల పరిపాలన ఇచ్చిన మాటపై నమ్మకం పెంచుతోంది : మంత్రి పేర్ని నాని

  • ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తాం
  • అక్రమాలు చేస్తే ఎంతటి వారినైనా వదలం
  • రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉంది

అక్రమాలు చేస్తే ఎంతటి వారినైనా వదలమని, వారిపై చర్యలు తప్పవని  మంత్రి పేర్ని నాని అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్ నెలరోజుల పరిపాలన ఇచ్చిన మాటపై నమ్మకం పెంచే పాలనగా అడుగులు వేస్తోందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో జగన్ పాలన సాగిస్తున్నారని అన్నారు. రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉందని, దాన్నిరూపుమాపేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.1150 కోట్లను హైకోర్టు సమక్షంలో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇరవై లక్షల ఇళ్ళ నిర్మాణానికి స్థలాలు కేటాయించేందుకు అడుగులు వేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే వారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని, ఆ వైద్యం ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని వివరించారు. 

More Telugu News