Narendra Modi: ట్రంప్-మోదీ చర్చలపై ఇవాంకా కీలక వ్యాఖ్యలు

  • సానుకూలవాతావరణంలో చర్చలు
  • భారత్ తమకు కీలక భాగస్వామి అని పేర్కొన్న ఇవాంకా
  • ట్రంప్-మోదీ చర్చల సారాంశం వెల్లడి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన కుమార్తె ఇవాంకా అత్యున్నత సలహాదారుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, ట్రంప్ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన చర్చలపై ఆమె అధ్యక్షుడి అత్యున్నత సలహాదారు హోదాలో  స్పందించారు. ట్రంప్-మోదీ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, 5జీ, వాణిజ్య సంబంధాలతో పాటు ఎంతో కీలకమైన ఇరాన్ వ్యవహారంపైనా ఇరువురు నేతలు చర్చలు జరిపారని ఇవాంకా వెల్లడించారు. భారత్ తమకు వ్యాపార, రక్షణ రంగాల్లో కీలక భాగస్వామి అని తెలిపారు. జసాన్ వేదికగా జి-20 సదస్సుకు ట్రంప్, మోదీ సహా అనేక ప్రపంచదేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే.

More Telugu News