Andhra Pradesh: నలభై ఐదు రోజుల్లో కేబినెట్ సమ్ కమిటీ విచారణ పూర్తి కావాలి: మంత్రి కన్నబాబు

  • 15 రోజులకొకసారి కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్షిస్తారు  
  • ప్రజాధనం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది 
  • గత ఐదేళ్లలో అవినీతిలో ఏపీది మొదటి స్థానం 

ఏపీ మంత్రి వర్గ ఉపసంఘంతో సీఎం జగన్ తొలి సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని జగన్ నివాసంలో నిర్వహించిన ఈ భేటీ అనంతరం మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ, విభజన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలు ఆకాంక్షించారని అన్నారు. ప్రజాధనం కాపాడటం, వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. నలభై ఐదు రోజుల్లో కమిటీ విచారణ పూర్తి కావాలని సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. పదిహేను రోజులకొకసారి కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్షించనున్నారని, గత ఐదేళ్లలో అవినీతిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, పలు స్వచ్ఛంద సంస్థలు నివేదికలు ఇచ్చాయని విమర్శించారు. ఆ నివేదికల ఆధారంగా విచారణ జరపాల్సిన అవసరముందని, అవినీతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.

నెలరోజుల పాలన ఎంతో పారదర్శకంగా ఉందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి కూడా ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. రైతుల నుంచి రుణాలు వసూలు చేసేందుకు కొన్ని బ్యాంకులు, డీసీసీబీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయని, రైతులతో సమన్వయంతో బ్యాంకులు వ్యవహరించాలని, రైతుల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా బ్యాంకులు వ్యహరించకూడదని జగన్ సూచించినట్టు చెప్పారు.

More Telugu News