Andhra Pradesh: ఏపీ మంత్రి వర్గ ఉపసంఘంతో సీఎం జగన్ భేటీ

  • గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష 
  • మంత్రి వర్గ ఉపసంఘంతో సీఎం జగన్ తొలి సమావేశం
  • ముప్పై అంశాలపై సమీక్షించనున్న ఉపసంఘం

ఏపీ మంత్రి వర్గ ఉపసంఘంతో సీఎం జగన్ తొలి సమావేశం కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరగుతున్న ఈ భేటీకి మంత్రి వర్గ ఉపసంఘ సభ్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతంరెడ్డి,  ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్, ఉపసంఘం ప్రత్యేక ఆహ్వానితులు విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు.

కాగా, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల సమీక్షకు కేబినెట్ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 30 అంశాలపై మంత్రి వర్గ ఉపసంఘం సమీక్షించనుంది. కీలక విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలపై సమీక్షించనుంది. మైనింగ్ లీజులు, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులపై, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రారంభించిన పథకాలపై, ఐటీ ప్రాజెక్టులు, భూ కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టు, సీఆర్డీఏ, ఓడరేవులు, విమానాశ్రయాల టెండర్ల ప్రక్రియపై సమీక్షించనుంది.

More Telugu News