నారా లోకేశ్ పై ఘాటు విమర్శలు చేసిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్!

30-06-2019 Sun 13:06
  • లోకేశ్ సిగ్గూఎగ్గూ లేకుండా మంత్రి అయ్యారు
  • వేలాది మందిని సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్నారు
  • అసమర్థుడిగా పేరు పొందారన్న వైసీపీ నేత

టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పప్పు అనే పేరుతో లోకేశ్ అసమర్థుడిగా పేరు పొందారని ఘాటుగా విమర్శించారు. ఈరోజు ట్విట్టర్ లో వరప్రసాద్ స్పందిస్తూ..‘అసమర్థుడిగా పేరొంది, పప్పు అనే నామకరణంతో సిగ్గూఎగ్గూ లేకుండా మంత్రి అయ్యారు.

ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన ఓ నారా లోకేశ్.. సోషల్ మీడియాలో సమాధానాలు ఇవ్వలేక వేల మందిని బ్లాక్ చేస్తున్నావ్. తద్వారా చేతకాని చేవలేని బుద్ధిని చూపించుకున్నావ్. చంద్రబాబూ.. ఇలాంటి అసమర్థుడితోనే నీ రాజకీయం?’ అని దుయ్యబట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం నడుస్తోంది.