Lacky Ferguson: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ను వణికించిన లాకీ ఫెర్గుసన్

  • గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు
  • ఎదుర్కోలేక ఆపసోపాలు పడిన ఆసీస్ టాపార్డర్
  • రెండు వికెట్లు దక్కించుకున్న ఫెర్గుసన్

ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్ తో వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, న్యూజిలాండ్ ఎక్స్ ప్రెస్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ ఆసీస్ ను హడలెత్తించాడు. ఫెర్గుసన్ ధాటికి వార్నర్, స్మిత్ పెవిలియన్ చేరారు. గంటకు 145 కిలోమీటర్లకు పైగా వేగంతో ఫెర్గుసన్ వేసే బంతులకు ఆసీస్ టాపార్డర్ ఇబ్బందులు ఎదుర్కొంది. తన తొలి రెండు ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చిన ఈ కుడిచేతివాటం స్పీడ్ స్టర్ 2 కీలక వికెట్లు తీసి ఆసీస్ ను కష్టాల్లోకి నెట్టాడు. మరోవైపు కెప్టెన్ ఫించ్ ను బౌల్ట్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 3 వికెట్లకు 55 పరుగులు కాగా, ఖవాజా, స్టొయినిస్ క్రీజులో ఉన్నారు.

More Telugu News