sharwanand: ఆసక్తిని రేపుతోన్న 'రణరంగం' టీజర్

  • మాఫియా డాన్ గా శర్వానంద్
  •  నాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్
  •  ఆగస్టు 2వ తేదీన విడుదల

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 'రణరంగం' సినిమా చేశాడు. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం టీజర్ ను రిలీజ్ చేశారు. "దేవుణ్ణి నమ్మాలంటే భక్తి వుంటే సరిపోతుంది .. కానీ మనుషుల్ని నమ్మాలంటే ధైర్యం కావాలి' అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ మొదలైంది.

మాఫియా డాన్ లుక్ తోను .. మాస్ లుక్ తోను ఈ టీజర్లో శర్వానంద్ కనిపిస్తున్నాడు. ఇటు కాజల్ తోను .. అటు కల్యాణి ప్రియదర్శన్ తోను ఆయన జట్టు కట్టిన షాట్స్ ను చూపించారు. 1990 నేపథ్యంలో సాగే కథగా ఈ సినిమా నిర్మితమైంది. ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో శర్వానంద్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

More Telugu News