Pakistan: పసికూనపై పాకిస్థాన్ ప్రతాపం... ప్రతిఘటిస్తున్న ఆఫ్ఘనిస్థాన్

  • టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్
  • బ్యాటింగ్ ఎంచుకున్న వైనం
  • 20 ఓవర్లలో 3 వికెట్లకు 104 పరుగులు

లీడ్స్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ సీమర్ షహీన్ అఫ్రిది ఆరంభంలోనే ఆఫ్ఘన్ ను దెబ్బకొట్టాడు. కెప్టెన్ గుల్బదిన్ నయిబ్, హస్మతుల్లా షాహిదీలను వరుస బంతుల్లో తిప్పిపంపాడు. దాంతో ఆఫ్ఘనిస్థాన్ 27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రహ్మత్ షా 35 పరుగులు చేసిన అనంతరం లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ వాసిం బౌలింగ్ లో వెనుదిరగడంతో ఆఫ్ఘన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో వికెట్ కీపర్ ఇక్రమ్ అలీఖిల్, అస్గర్ ఆఫ్ఘన్ సమయోచితంగా ఆడుతూ పాక్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. దాంతో ఆ జట్టు స్కోరు 19 ఓవర్లో 100 పరుగులు దాటింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 104 పరుగులు. అస్గర్ 35, అలీఖిల్ 13 పరుగులతో ఆడుతున్నారు.

More Telugu News