దసరా బరిలోకి దిగేస్తానంటోన్న శర్వానంద్

29-06-2019 Sat 16:27
  • విడుదలకి సిద్ధమవుతోన్న'రణరంగం'
  • తదుపరి షెడ్యూల్ దిశగా '96' రీమేక్
  • శర్వానంద్ సరసన సమంత
శర్వానంద్ తాజా చిత్రంగా 'రణరంగం' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టుగా '96' మూవీ రీమేక్ రూపొందుతోంది. ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచన చేశారు. అయితే షూటింగు సమయంలో శర్వానంద్ గాయపడటంతో ఆయనకి శస్త్రచికిత్స చేశారు. కొన్ని రోజుల పాటు శర్వానంద్ ఫిజియో థెరపీ కూడా చేయించుకోవాల్సి వుంది.

దాంతో ఈ సినిమా దసరాకి రాకపోవచ్చనే టాక్ వచ్చింది. అయితే .. జూలై చివరి వారం నుంచి తన పోర్షన్ కి సంబంధించిన షెడ్యూల్స్ వేసుకోమనీ, ఈ లోగా తన కాంబినేషన్ లేని సీన్స్ ను కానిచ్చేయమని శర్వానంద్ చెప్పినట్టుగా సమాచారం. దసరాకి ఈ సినిమాను తప్పకుండా రిలీజ్ చేయవలసిందేననేది శర్వానంద్ ఉద్దేశంగా కనిపించడంతో, ఆ దిశగానే సన్నాహాలు జరుగుతున్నట్టుగా చెబుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాయికగా సమంత కనిపించనున్న సంగతి తెలిసిందే.