IAF: ఐఏఎఫ్ విమానాన్ని ఢీకొట్టిన పక్షుల గుంపు.. తెలివిగా వ్యవహరించిన పైలట్‌పై ప్రశంసల జల్లు

  • విమానంలోని అదనపు ఇంధన ట్యాంకును జారవిడిచిన పైలట్
  • అతడి వేగవంతమైన నిర్ణయానికి ఐఏఎఫ్ ఫిదా
  • పెను ప్రమాదం నుంచి కాపాడాడంటూ ప్రశంసలు

ఆపద సమయంలో తెలివిగా వ్యవహరించిన భారత వాయుసేన పైలట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్షణాల వ్యవధిలో అతడు తీసుకున్న తెలివైన నిర్ణయానికి హేట్సాఫ్ చెబుతున్నారు. ఇంతకీ ఏమైందంటే.. ఈ నెల 27న భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ విమానాన్ని పక్షుల గుంపు ఢీకొట్టింది. క్షణాల్లోనే అప్రమత్తమైన యువ పైలట్ విమానంలో అదనంగా ఉన్న ఇంధన ట్యాంకులు, కేరియర్ బాంబ్ లైట్ స్టోర్స్ (సీబీఎల్‌ఎస్) పాడ్స్‌ను కిందికి జారవిడిచాడు. ఫలితంగా పెను ప్రమాదం నుంచి విమానాన్ని, అందులోని వారిని కాపాడాడు. ఇంధన ట్యాంకును విడిచిపెట్టిన అనంతరం అంబాలా ఎయిర్‌బేస్‌లో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.

పైలట్ వేగవంతమైన నిర్ణయానికి, ప్రొఫెషనలిజానికి ఐఏఎఫ్ ఫిదా అయింది. పెను ప్రమాదం నుంచి కాపాడగలిగాడంటూ ప్రశంసల్లో ముంచెత్తుతోంది. కాగా, పక్షులు ఢీకొట్టడంతో విమానం ఇంజిన్‌లో కొంత లోపం తలెత్తినట్టు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఏఎఫ్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.

More Telugu News