sharwanad: 'రణరంగం' టీజర్ రిలీజ్ కి రంగం సిద్ధం

  • సుధీర్ వర్మ నుంచి 'రణరంగం'
  • డిఫరెంట్ లుక్స్ తో శర్వానంద్ 
  • నాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్

సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా 'రణరంగం' నిర్మితమైంది. డిఫరెంట్ లుక్స్ తో శర్వానంద్ కనిపించే ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా కాజల్ - కల్యాణి ప్రియదర్శన్ కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది.

రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకి టీజర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్లో రఫ్ లుక్ తో శర్వానంద్ ఆకట్టుకుంటున్నాడు. టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలను పెంచేయాలనే ఆలోచనలో వున్నారు. ఇంతకుముందు శర్వానంద్ చేసిన 'పడి పడి లేచె మనసు' పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశతో ఆయన వున్నాడు. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ పరిస్థితి కూడా అంతే. వాళ్లకి కూడా ఈ సినిమా సక్సెస్ కావడం చాలా అవసరం.

More Telugu News