sensex: ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • వారాంతాన్ని నష్టాల్లో ముగించిన మార్కెట్లు
  • వరుసగా రెండో రోజు నష్టాలు
  • 191 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. జీ20 సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీల మధ్య జరిగిన సమావేశం కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈ ఉదయం సూచీలు లాభాలతోనే ప్రారంభమైనప్పటికీ... ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు, మెటల్, ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో... మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివర్లో కొంత మేర కొనుగోళ్లు జరగడంతో... నష్టాలు కొంచెం తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోయి 39,394కి పడిపోయింది. నిఫ్టీ 52 పాయింట్లు పతనమై 11,788కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.05%), యాక్సిస్ బ్యాంక్ (0.91%), ఎన్టీపీసీ (0.75%), మారుతి సుజుకి (0.71%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.70%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-3.29%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.85%), టాటా మోటార్స్ (-1.96%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.79%),  ఓఎన్జీసీ (-1.64%).

More Telugu News