Mumbai: ముంబయిని ముంచెత్తుతున్న వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

  • నేటి ఉదయం నుంచి ఎడతెరిపిలేని వాన
  • లోతట్టు ప్రాంతాలు జలమయం
  • ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు

నైరుతి సీజన్ మొదలైన తర్వాత తొలిసారిగా ముంబయిలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో ముంబయి వ్యాప్తంగా రవాణా వ్యవస్థలు, సేవలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దు చేశారు. మరికొన్ని విమానాల షెడ్యూల్ ను సవరించారు.

ప్రధాన రోడ్లపై మోకాలి లోతున నీళ్లు ప్రవహిస్తుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. నగరంలోనే కాకుండా, శివారుప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రోడ్ల పక్కన ఉన్న చెట్టు కొమ్మలు విరిగి వాహనాలపై పడ్డాయి. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రేపటి వరకు ఇదే విధంగా వర్షపాతం ఉంటుందని వాతావరణ విభాగం చెబుతుండడంతో ముంబయి అధికార వర్గాలు తగిన చర్యలకు ఉపక్రమించాయి.

More Telugu News